VIDEO: తనకు న్యాయం చేయమంటూ ఓ బిడ్డ తల్లి...!
HNK: ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని తెలిపింది. తాగుడుకు బానిసై రోజు వేధిస్తున్నాడని వాపోయింది. పలుమార్లు స్టేషన్‌లో కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదని, పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుతానని పిలిపించి దాడికి పాల్పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది.