రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి లాకుల వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లి మధుసూదనరావు (65) అనే వృద్ధుడు మృతి చెందాడు. దిండి నుంచి ద్విచక్ర వాహనంపై శివకోటి వస్తుండగా, ముందు వెళ్తున్న లోడు ఆటోను వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.