రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

GNTR: కాకుమానుకి చెందిన రైతు దొప్పలపూడి చంద్రపాల్ వ్యవసాయ పనుల నిమిత్తం శనివారం కర్లపాలెం వెళ్లి వరి నారు కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా, బాపట్ల జిల్లా నల్లమోతువారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆటో, బైక్ ఢీకొనడంతో చంద్రపాల్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.