ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం: సీపీ
RR: చేవెళ్ల ప్రమాద స్థలాన్ని సీపీ అవినాష్ మహంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19 మంది మృతిచెందగా 13 మృతదేహాలను గుర్తించామని, పోస్ట్ మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగిస్తామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని, సాంకేతిక సమస్యల వల్ల రోడ్డు విస్తరణ పనులు ఆలస్యమవుతున్నాయని, రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటాయన్నారు.