పెద్దిరెడ్డి అభినవ వీరప్పన్: మర్రెడ్డి

పెద్దిరెడ్డి అభినవ వీరప్పన్: మర్రెడ్డి

ఎన్టీఆర్: మాజీ మంత్రి పెద్దిరెడ్డి అభినవ వీరప్పన్ అని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వీరప్పన్ ఏనుగు దంతాలు దోచుకుంటే.. జగన్ అండతో పెద్దిరెడ్డి భారీగా భూములు దోచుకొని అడవినే సృష్టించుకున్నాడన్నారు. సమాజానికి జగన్, అతడి అనుచరులు చీడలా మారారని దుయ్యబట్టారు.