'గుర్రం పాపిరెడ్డి' ట్రైలర్ చూశారా?
యంగ్ హీరో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన డార్క్ కామెడీ మూవీ 'గుర్రం పాపిరెడ్డి'. ఈ నెల 19న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, తమిళ నటుడు యోగిబాబు కీలక పాత్రలు పోషించారు.