'వినోబా భావే ఆశయాలు ప్రపంచానికే ఆదర్శం'

యాదాద్రి: వినోబా భావే ఆశయాలు ప్రపంచానికే ఆదర్శమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం పోచంపల్లిలో ఆచార్య వినోబా భావే 130వ జయంతి వేడుకలకు వారు హాజరైయ్యారు.అనంతరం భూదానోద్యమ పితామహుడు ఆచార్య వినోబా భావే, ప్రథమ భూదాత వెధిరే రామచంద్రారెడ్డిల కాంస్య విగ్రహాలకు వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు.