VIDEO: ఇద్దరు రైతుల ప్రాణాల మీదకు తెచ్చిన యూరియా కొరత

WGL: యూరియా బస్తాల కొరత ఇద్దరు రైతుల ప్రాణాల మీదకు తెచ్చింది. గురువారం రాయపర్తి మండలం సూర్య తండకు చెందిన మునావత్ మంజ్వ, ఊకల్ గ్రామానికి చెందిన బొల్లె బోయిన యాదయ్య యూరియా బస్తాల కోసం లైన్‌లో నిలబడ్డాడు. మంది ఎక్కువ కావడంతో తోపులాట జరగగా మంజ్వ వెన్నుపూస భాగంలో తీవ్ర గాయాలు కాగా యాదయ్య కాలుకు బలమైన గాయమైంది. ఈఘటన స్థానిక రైతులను ఆగ్రహానికి గురిచేసింది.