కమాన్ పూర్ కు చేరుకున్న చీరలు
PDPL: కమాన్‌పూర్ మండలంలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణి చేసే ఇందిరమ్మ చీరలు మండల కేంద్రంలోని సెర్ఫ్ కార్యాలయానికి శనివారం చేరుకున్నాయి. మండలంలోని 9 గ్రామపంచాయతీలకు సంబంధించి 6,503 మంది మహిళలకు చీరలను సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో "సెర్ప్" ఆధ్వర్యంలో సీఏలు మహిళలకు చీరలు పంచేయనున్నారు.