అబుధాబిలో భారతీయులకు గాయాలు

అబుధాబిలో భారతీయులకు గాయాలు

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ క్షిపణి శకలాలు పడి యూఏఈలోని అబుధాబిలో ఐదుగురు భారతీయులు గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. తమవైపు దూసుకొచ్చిన బాలిస్టిక్‌ క్షిపణిని గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. క్షిపణి శకలాలు కెజాద్‌లో రెండుచోట్ల పడటంతో పెద్దఎత్తున మంటలు చెలరేగినట్లు వెల్లడించింది.