VIDEO: పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య
HYD: పాతబస్తీలోని కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అరవింద్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దూద్ బౌలి నుంచి తన బైక్‌పై ఇంటికి వెళ్తున్న అరవింద్‌ను దేవిబాగ్‌లో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.