VIDEO: భోజనాలు వడ్డించిన ఎమ్మెల్యే
KKD: అన్న క్యాంటీన్‌లు పేద ప్రజల ఆకలి తీరుస్తున్నాయని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద సోమవారం నిర్వహించిన ఉచిత అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని భోజనాలు వడ్డించారు. నాలుగేళ్లుగా దాతల సహకారంతో ప్రతి సోమవారం ఉచితంగా భోజనాలు అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ అన్నా కాంటీన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.