BREAKING: మోదీకి పుతిన్ ఫోన్.. ఏమన్నారంటే?

ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను చట్టప్రకారం శిక్షించాలని సూచించారు. పుతిన్‌కు మోదీ రష్యా విక్టరీ డే శుభాకాంక్షలు తెలిపారు.