హనుమంతయ్య పుస్తకాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ATP: విశ్రాంత ఉద్యోగి హనుమంతయ్య రచించిన ఐదు పుస్తకాలను MLA అమిలినేని సురేంద్ర బాబు ఆవిష్కరించారు. ఆరోగ్య చిట్కాలు, హాస్యం వంటి అంశాలపై పుస్తకాలు రచించిన హనుమంతయ్యను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. త్వరలో నిర్మించనున్న అంబేద్కర్ భవన్‌లో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని, ఈ పుస్తకాలను అక్కడ అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే కోరారు.