దీపం కారణంగా పాన్ షాప్ దగ్ధం.. రూ.లక్ష నష్టం

దీపం కారణంగా పాన్ షాప్ దగ్ధం..  రూ.లక్ష నష్టం

ములుగు: మంగపేట మండలం మల్లూరు మైసమ్మ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పూజ కోసం వెలిగించిన దీపం నుంచి మంటలు వ్యాపించి పాన్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. శనివారం పూజ కోసం వెలిగించిన దీపం నుంచి మంటలు వ్యాపించి, డబ్బాలో ఉన్న పెట్రోల్ సీసాలు, గ్యాస్ సిలిండర్‌కు అంటుకున్నాయి. ఈ ఘటనలో సుమారు రూ.1 లక్ష ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.