వయోవృద్ధుల హక్కులు కాపాడాలి: సుధారాణి
WNP: జిల్లా కలెక్టరేట్ మందిరంలో ఈనెల 19న వయోవృద్ధుల దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు DWO సుధారాణి తెలిపారు. ప్రతి ఒక్కరూ వృద్ధుల హక్కులను కాపాడాలని ఆమె అన్నారు. వయోవృద్ధులు పోషణ, సంరక్షణ చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.