నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు

నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. రానున్న వానాకాలం దృష్ట్యా విత్తనాల నాణ్యతపై దృష్టి పెట్టాలని, అనుమతి లేకుండా వ్యాపారం చేసే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని సూచించారు.