VIDEO: చెరుకు నరికేందుకు గిరిజనుల వలసలు
SRD: కంగ్టి మండలంలోని పలు తండాలకు చెందిన గిరిజన కూలీలు సంత, బొంత, సర్దుకొని పిల్లాపాపలతో వలసకు బయలుదేరారు. స్థానికంగా వ్యవసాయ పనుల్లో ఉపాధి లేకపోవడంతో ప్రతి ఏడాది మాదిరిగానే చెరుకు నరికేందుకు వెళుతున్నారు. మండలంలోని సాధు, తండా, తుకారం తాండ, ముకుంద తాండ తదితర గ్రామాల గిరిజనులు మనూరు మండలంలోని చెరుకు తోటలకు వలస వెళ్తున్నట్లు బుధవారం చెప్పారు.