దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు RTC బస్ స్టాండ్ వద్ద ఎమ్మెల్యే అశోక్ రెడ్డి "దివ్యాంగ శక్తి” పథకాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులతో కలిసి ప్రయాణిస్తూ వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.