గురుపూజోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వరి

PPM: కురుపాం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ జగదీశ్వరి శుక్రవారం పార్వతీపురంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు.