VIDEO: నాటు సారాపై వన్ టౌన్ పోలీసుల దాడులు
KRNL: ఆదోని పట్టణంలోని రణమండల కొండ ప్రాంతంలో వన్ టౌన్ పోలీసులు నాటుసారా తయారీ కేంద్రాలపై ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 1800 లీటర్ల నాటు సారాను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అక్రమ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయన్నారు.