VIDEO: తెనాలిలో అగ్ని ప్రమాదం
GNTR: తెనాలి సమీప మల్లెపాడులో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కూచిపూడి రాజేష్‌కి చెందిన షెడ్డుపై సమీప పొలాల నుంచి నిప్పు రవ్వలు పడటంతో జనరేటర్, మోటార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.