రేపు జిల్లా కేంద్రంలో మెగా వైద్య శిబిరం

MBNR: దేవరకద్ర మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంజి శ్రీరెడ్డి, జీకేఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ కోన రాజశేఖర్ తెలిపారు. అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉండటంతో పాటు వైద్య పరీక్షలు, మందులు ఉచితంంగా అందజేస్తారు.