మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 50 రోజులు జైలు శిక్ష

ప్రకాశం: రాచర్లలో మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తికి గిద్దలూరు కోర్టు బుధవారం 50 రోజులు జైలు శిక్ష రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. ఎస్సై కోటేశ్వరరావు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో భాగంగా మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తిని గుర్తించి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి భరత్ చంద్ర విచారణ అనంతరం నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించారు.