జిల్లా స్థాయి క్రీడా పోటీలకు దొరిగల్లు విద్యార్థినులు ఎంపిక

జిల్లా స్థాయి క్రీడా పోటీలకు దొరిగల్లు విద్యార్థినులు ఎంపిక

సత్యసాయి: ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు జడ్పీ హైస్కూల్ విద్యార్థినులు లతా, అను, స్నేహ జిల్లాస్థాయి హార్డిల్, ట్రిపుల్ జంప్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. బత్తలపల్లి ఆర్డీటీ మైదానంలో జరిగిన ఎస్ఓఎఫ్ జోనల్ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వీరిని హెచ్ఎం లక్ష్మీనారాయణతోపాటు పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు.