'పార్టీ మద్దతు వద్దు'

'పార్టీ మద్దతు వద్దు'

HNK: శాయంపేట మండల కేంద్రంలోని ప్రగతి సింగారంలో ఎస్సీ రిజర్వ్ సర్పంచ్ స్థానానికి అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలని, పార్టీల మద్దతు తీసుకోవద్దని ఎస్సీ కుల పెద్దలు ఏకగ్రీవంగా తీర్మానించారు. పార్టీలతో పోటీ చేస్తే ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు తీర్మానం పాటించాలని సూచించారు. ఈ నిర్ణయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.