పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని పోలేపల్లి సమీపంలో CCI ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇవాళ సందర్శించారు. పత్తి కొనుగోలు సందర్భంగా తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు.