'యూరియా కష్టాలతో రైతులు అరిగోస పడుతున్నారు'

'యూరియా కష్టాలతో రైతులు అరిగోస పడుతున్నారు'

WNP: యూరియా కష్టాలతో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ జడ్పీటీసీ కృష్ణయ్య యాదవ్ అన్నారు. సోమవారం మదనాపురం రైతు సేవ కేంద్రం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రైతులకు ఏ కష్టం రాకుండా పాలన అందించారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు యూరియా కష్టాలు తీసుకొచ్చి రైతుల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు.