దీపికకు పుట్టపర్తిలో 10 సెంట్ల స్థలం: కలెక్టర్

దీపికకు పుట్టపర్తిలో 10 సెంట్ల స్థలం: కలెక్టర్

సత్యసాయి: భారత అంధ మహిళల టీ20 కెప్టెన్ దీపికకు మడకశిరలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆమెకు పుట్టపర్తిలో 10 సెంట్ల స్థలాన్ని ఇస్తామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. అలాగే మడకశిర నియోజకవర్గం, యాదవ సంఘం తరఫున రూ.4 లక్షల చెక్కులను అందజేశారు. మడకశిరలోని ఇండోర్ స్టేడియానికి దీపిక పేరు పెట్టాలని స్థానికులు కోరారు.