లైసెన్స్ తప్పనిసరి.. ఫుడ్ సేఫ్టీ అధికారులు
NZB: వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, లేని యెడల కేసులు నమోదు చేస్తామని జిల్లా ఆహార భద్రతా అధికారులు టి. సునీత, ఇ. నవిత తెలిపారు. గురువారం సాయంత్రం కమ్మర్‌పల్లి మండల కేంద్రంతో బోంది తదితర తినుబండారాల తయారీ కేంద్రాలు, సూపర్ మార్కెట్‌లు, రెస్టారెంట్లను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.