అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్
WGL: గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ బొల్లికుంట, ఆదర్శ్ నగర్, ఇతర ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ గద్దే బాబు పరిశీలించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలని, డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.