రౌడీ షీటర్లకు సీఐ కౌన్సిలింగ్
PLD: నరసరావుపేట రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఎం.వి. సుబ్బారావు ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చట్టపరమైన నిబంధనలు పాటించాలని సూచించారు. ఎవరైనా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు పోలీసులకు సహకరించాలన్నారు.