VIDEO: రహదారి పై పెద్ద గుంత.. ప్రమాద భయంలో వాహనదారులు
WGL: రాయపర్తి మండలం మైలారం-ఊకల్ ప్రధాన రహదారిలో పానిష్ తండా వద్ద ఇటీవలి భారీ వర్షాల కారణంగా పెద్ద గుంత ఏర్పడింది. దీంతో ద్విచక్ర వాహనదారులు రాత్రి సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తండావాసులు గుంత కనబడేలా కర్ర నిలబెట్టి సంచి పెట్టారు. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి ప్రమాదాలను నివారించాలని సోమవారం స్థానికులు కోరారు.