రాపూరులో కోతులతో ఇబ్బందులు

రాపూరులో కోతులతో ఇబ్బందులు

NLR: రాపూరు పట్టణంలో కోతుల బెడద తీవ్రంగా మారింది. గుంపులుగా తిరుగుతూ ఇళ్ల తలుపులు తెరిచి ఉంటే లోపలికి చొరబడి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్తున్నాయి. అడ్డువచ్చిన వారిపై దాడులకు కూడా పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో ఒకసారి పట్టుకున్నప్పటికీ, ప్రస్తుతం నియంత్రణ చర్యలు లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.