డంపింగ్ యార్డ్‌లా మారుతున్న బుడ్డేపుపేట ప్రధాన రహదారి
SKLM: ఇచ్చాపురం మండలం మండపల్లి పంచాయితీలోని బుడ్డేపుపేట గ్రామానికి వెళ్లే రహదారి రోజురోజుకు డంపింగ్ యార్డ్‌లా మారుతుంది. చెత్తచెదారం రోడ్డు పక్కనే ప్రతిరోజు పడివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. బుడ్డేపుపేట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇదొక్కటే కావడంతో గ్రామస్థులు ఈ దారిలో వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటన్నారు. గ్రామ సర్పంచ్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.