'జీవో 252 ను రద్దు చేయాలి '

'జీవో 252 ను రద్దు చేయాలి '

PDPL: జర్నలిస్టుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే జీవో 252ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (హెచ్ 143) ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో కోత విధిస్తే సహించేది లేదని, ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.