VIDEO: ప్రైవేట్ బస్సులో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు

VIDEO: ప్రైవేట్ బస్సులో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు

BDK: భద్రాచలం-బెంగళూరుకు బయలుదేరిన కావేరి ప్రైవేట్ బస్సులో గురువారం ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ పాల్వంచలోని నవభారత్ సెంటర్లో బస్సును నిలిపివేయగా, అందరూ సురక్షితంగా దిగిపోయారు. మరో బస్సులో ప్రయాణికులను పంపించారు. అయితే, పొగలు రావడానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.