ALERT: క్యాన్సర్‌తో లక్ష మంది మృతి!
దేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 1990 నుంచి 2023 మధ్య ఈ కేసులు 477%, మరణాలు 352% పెరిగాయని 'లాన్సెట్' నివేదిక తెలిపింది. 2023లోనే దేశంలో 2.03 లక్షల కేసులు, లక్ష మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి ఈ కేసులు 35 లక్షలకు చేరుతాయని అంచనా. ఈ వ్యాధి పట్ల అవగాహన, ముందస్తు పరీక్షలు అత్యవసరమని వాషింగ్టన్ వర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు.