'గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'
ADB: గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్ సూచించారు. గురువారం పట్టణంలోని బంగారిగూడలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. అక్రమంగా మద్యం అమ్ముతున్నటువంటి 3 బెల్ట్ షాపులు, 60 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, 2 మ్యాక్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆసాంఘిక కార్యకలాపాల నిర్వహణ చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.