VIDEO: పంట పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
PLD: చిలకలూరిపేట పట్టణంలో హ్యాపీ హోమ్స్ సమీపంలో గల పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పొలాల్లో మృతదేహాన్ని గమనించిన స్థానిక రైతులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న చిలకలూరిపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.