నిన్ను చంపేస్తామంటూ ఎంపీకి బెదిరింపులు
నటుడు, BJP ఎంపీ రవి కిషన్‌కు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపింది. తమ వర్గాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎంపీని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. నాలుగు రోజుల్లో రవి బీహార్‌కు వచ్చేటప్పుడు కాల్చేస్తామని బెదిరించాడు. దీంతో ఎంపీ సిబ్బంది గోరఖ్‌పుర్‌లో PSలో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.