బావిలో పడి వ్యక్తి మృతి

బావిలో పడి వ్యక్తి మృతి

అనకాపల్లి: పట్టణ పరిధిలో జాతీయ రహదారి వద్ద గల బావిలో పడి ఓ వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. గవరపాలెం చిన్న రామస్వామి వీధికి చెందిన పొలిమేర నాయుడు ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మరణించాడు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.