ఓటరుపై దాడి చేసిన ఎంపీ అభ్యర్థి సోదరుడు

Hyd: జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ సోదరుడు నగేశ్ షెట్కార్ ఓ ఓటరును కాలితో తన్నాడు. నారాయణఖేడ్‌లోని పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నగేశ్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.