VIDEO: విడవలూరు మండలంలో వడగండ్ల వాన

NLR: విడవలూరు మండలం వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం గాలి వానతో కూడిన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మండలంలోని చౌకచర్ల ప్రాంతంలో వడగండ్ల వాన పడింది. దీంతో అక్కడి ప్రజలకు ఉక్కపోత నుండి కాస్త ఉపశమనం కలిగినట్లు అయింది. అయితే, రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షాలతో తమ పొలాలకు నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు.