బాధిత కుటుంబానికి ఎల్వోసీ అందజేత

PDPL: రామగిరి మండలం బేగంపేటకు చెందిన అయితోజు రమ్య అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయం కోసం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును సంప్రదించారు. వెంటనే స్పందించిన మంత్రి సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం ఆమెకు రూ 75,000 విలువైన ఎల్వోసీని మంజూరు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయ సిబ్బంది శుక్రవారం బాధిత కుటుంబీకులకు ఎల్వోసీని అందజేశారు.