కూలిపోయిన చెక్ డ్యామ్‌ను పరిశీలించిన బీజేపీ నేతలు
KNR: జమ్మికుంట మండలం గుంపుల - శంబునపల్లి మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్‌ను, బీజేపీ నాయకులు పరిశీలించారు. చెక్ డ్యాం కూలిపోవడానికి కాంట్రాక్టర్ నాసిరకం పనులా, లేక ఇసుక మాఫియా పనా అనే విషయంపై నిజాలు నిగ్గు తేల్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.