గిరిజన గ్రామాలలో పర్యటించిన పోడెం
BDK: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య ఈరోజు దుమ్ముగూడెం మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలను పర్యటించారు. ఈ సందర్భంగా గౌరవ ఛైర్మన్ స్థానిక గిరిజన ప్రజలతో ముఖాముఖి సమావేశమై, వారి జీవన పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు, సమస్యలు మరియు అవసరాలపై సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు.