కుమార్తె వీడియోలు చూపించి తల్లికి బ్లాక్ మెయిల్

విశాఖ: భీమిలిలో ఫొక్సో కేసు నమోదైనట్లు సమాచారం. గాజువాకకు చెందిన వ్యక్తి భీమిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఆ వీడియోతో బాలిక తల్లిని బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.