ఏలూరులో గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
ఏలూరులో కార్తికేయ పాయ పరోట హోటల్, డాల్ఫిన్, సాయి దుర్గ టిఫిన్స్, లక్ష్మీ గణపతి క్యాటర్స్ హోటళ్లలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదివారం తనిఖీలను నిర్వహించారు. రాబడిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి రూ.44,530 రూపాయల విలువైన 18 గృహ అవసరాల గ్యాస్ (సబ్సిడీ) సిలిండర్లను సీజ్ చేశారు. 1955 ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు.