బాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువుల పంపిణీ

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలోని 17 వార్డులో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 3 ఇండ్లు కూలిపోయాయి. సమాచారం అందుకున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ కోనేటి పుష్పలత బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, నిత్యవసర వస్తువులను అందజేశారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందజేయాలని తాహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడారు.